షాకింగ్ : “ఓజి” కి ఊహించని బడ్జెట్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ కం యాక్షన్ చిత్రం “ఓజి” ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కూడా ఒకటి. అయితే ఈ సినిమాపై హైప్ ని ఈ సినిమా నటులు ఇపుడు ఊహించని లెవెల్లో అయితే ఎక్కిస్తున్నారు అని చెప్పాలి.

మొన్న శ్రీయ రెడ్డి నిన్న అర్జున్ దాస్ ఇపుడు లేటెస్ట్ గా మరో నటుడు చేసిన కామెంట్స్ గట్టిగా వైరల్ అవుతున్నాయి. అయితే దీనితో ఇపుడు ఓజి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు పెడుతున్న బడ్జెట్ ఇంత ఉండొచ్చు అనే షాకింగ్ నెంబర్ ఇపుడు ఆశ్చర్యకరంగా మారింది.

ఈ నటుడు మాట్లాడుతూ తన అంచనా ప్రకారం ఓజి 400 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు ఉన్నారు అని ఈ సినిమా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు భారీ విజువల్స్ సెట్టింగ్స్ తో ఊహించని లెవెల్లో చాలా గ్రాండ్ గా సుజీత్ తెరకెక్కిస్తున్నాడు అని అన్ని రికార్డ్స్ ఈ చిత్రం పగలగొట్టేస్తుంది అని తాను అంటున్నాడు.

దీనితో ఈ సినిమా పై హైప్ ఇంకోసారి నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళిపోయింది. మరి ఓజి నిజంగా ఈ రేంజ్ అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి. కాగా ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా ఈ ఏడాదిలోనే పాన్ ఇండియా రిలీజ్ కి ఈ చిత్రం వచ్చే ఛాన్స్ లు హై లెవెల్లో ఉన్నాయి.