షాకింగ్ : “భోళా శంకర్” మరో భాషలో రిలీజ్.!

టాలీవుడ్ సినిమా దగ్గర అనుకోని విధంగా భారీ ప్లాప్ గా నిలిచిన లేటెస్ట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరు నటించిన మాస్ చిత్రం “భోళా శంకర్” అని చెప్పాలి. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం చిరు కెరీర్ లోనే మరో పెద్ద డిజాస్టర్ కాగా దీని వచ్చే నష్టాలు అయితే ఇక ఆచార్య ని మించి ఉంటాయి అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.

కాగా ఈ చిత్రం తెలుగులో ప్లాప్ అయితే మరో పక్క మరో భాషలో ఐతే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు షాకింగ్ గా మారింది. మరి దీనితో అయితే భోళా శంకర్ చిత్రం ఈ ఆగస్ట్ 25న హిందీ భాషలో రిలీజ్ కాబోతుందట. మరి ఇది కూడా థియేట్రికల్ రిలీజ్ గానే ఉండగా.

ఈ చిత్రానికి మెగాస్టార్ పాత్రకి గాను బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ అయితే డబ్బింగ్ అందించనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో తెలుగులో పెద్దగా ఆడని సినిమాని హిందీ రిలీజ్ అనౌన్స్ చేయడంతో ఇపుడు అంతా షాకవుతున్నారు. పైగా హిందీ రిలీజ్ పై ఓ టీజర్ ని కూడా సైలెంట్ గా రిలీజ్ చేసేసారు.

దీనితో భోళా శంకర్ హిందీ రిలీజ్ ఫిక్స్ అయ్యింది. కాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ చిరుకి చెల్లి పాత్రలో నటించింది. అలాగే మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని నిర్మాత అనిల్ సుంకర నిర్మాణం వహించారు. ఇక హిందీలో అయితే భోళా శంకర్ పరిస్థితి ఎలా ఉంటుందో కొన్ని రోజులు ఆగి చూస్తే తెలుస్తుంది. 
Bhola Shankar Official Hindi Teaser | Megastar Chiranjeevi, Keerthy, Tamannaah | Jackie Shroff