షాకింగ్ : ఆ సినిమా తర్వాత సినిమాలు ఆపేస్తున్న బిగ్గెస్ట్ స్టార్ హీరో?

తమ సినిమా కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నపుడు ఏ హీరో అయినా కూడా తన క్రేజ్ ని మరింత క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి అలా ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో సహా కోలీవుడ్ సినిమా దగ్గర కూడా భారీ మార్కెట్ ఉన్న స్టార్ హీరోలు ఉండగా వారిలో ఒక అన్ రియల్ క్రేజ్ అయితే ఉన్న బిగ్గెస్ట్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఒకరు.

మరి విజయ్ బ్రాండ్ పేరు మీదే భారీ మొత్తంలో బిజినెస్ జరుగుతుంది. అలా ఇపుడు చేస్తున్న “లియో” సినిమాపై సెన్సేషనల్ క్రేజ్ నెలకొనగా దీని తర్వాత విజయ్ తన కెరీర్ లో 69వ సినిమాని అయితే దర్శకుడు వెంకట్ ప్రభు తో అయితే సినిమా చేయనున్నాడు.

కాగా ఇప్పుడు విజయ్ అయితే ఇంత పీక్ స్టేజి లో తన సినిమాలు ఆపేస్తున్నాడని కొన్ని షాకింగ్ వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. లేటెస్ట్ గా విజయ్ కోలీవుడ్ సినిమా దగ్గర పలు పొలిటికల్ రిలేటెడ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారగా బహుశా విజయ్ కానీ తన సినిమాలు అయితే ఆపేసి రాజకీయాల్లోకి వస్తాడా అనే టాక్ కూడా వైరల్ గా మారింది.

మరి విజయ్ నిజంగానే ఈ సెన్సేషనల్ స్టేట్మెంట్ చేశాడా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఇప్పుడు అయితే తాను నటిస్తున్న లియో ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కితుండగా త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా అయితే రిలీజ్ కాబోతుంది.