రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యి భారీ వసూళ్లతో అదరగొడుతున్న లేటెస్ట్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్ భాగం 2” కోసం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా తన కెరీర్ లో మరో పెద్ద హిట్ గా అయితే నిలిచే దిశగా వెళ్తుంది.
మరి ఇదిలా ఉండగా ఈ సినిమా కంప్లీట్ చేసాక విక్రమ్ హీరోగా మరో టాలెంటెడ్ దర్శకుడు పా రంజిత్ తో అయితే భారీ బడ్జెట్ చిత్రం “తంగళాన్” చేస్తున్నాడు. కాగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తుండగా తాను పొన్నియిన్ సెల్వన్ 2 హిట్ కొట్టేసాక నిన్ననే షూటింగ్ లో ప్లాగొన్నాడు.
కానీ ఈ కొంతలోనే తాను పెను ప్రమాదానికి లోనయినట్టుగా షాకింగ్ వార్త బయటకి వచ్చింది. ఇక మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో విక్రమ్ రిహార్సల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు తన పక్కటెముక విరిగిపోయిందట. దీనితో వెంటనే తనని డాక్టర్స్ కి చూపించగా గాయం పెద్దదే అని ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని తెలిపాట.
అంతే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పకుండా తాను నటించడం కుదరదు అని ఆపరేషన్ చేయాలని తెలిపారట. ఓ పక్క పొన్నియిన్ సెల్వన్ భారీ హిట్ అయ్యింది అనే సమయంలో విక్రమ్ నుంచి ఇలాంటి వార్త రావడం బాధాకరం అని చెప్పాలి. అలాగే ఈ చిత్రంలో అయితే మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా జి వి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.