ఏంటి అప్పుడే పవన్ “ఓజి” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారా.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో రెండు తన ఫ్యాన్స్ తో చేస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇక వీటిలో మొదట దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” ఒకటి కాగా మరొకటి దర్శకుడు సుజీత్ తో చేస్తున్న సినిమా “ఓజి” కూడా ఒకటి.

అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వస్తుండగా ఆల్రెడీ పవన్ అయితే ఉస్తాద్ కన్నా ఓజి షూట్ లోనే ఎక్కువ పాల్గొన్నారు. పైగా ఓజి షూట్ నుంచి అయితే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తుండగా ఫ్యాన్స్ కూడా మంచి ఎగ్జైటెడ్ గా ఈ సినిమా పట్ల ఉన్నారు.

ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై అయితే ఇప్పుడు సినీ వర్గాలు నుంచి ఊహించని టాక్ బయటకి వచ్చింది. అప్పుడే ఈ సినిమా రిలీజ్ టైం ని అయితే మేకర్స్ లాక్ చేసేసారు అట. సినీ వర్గాల్లో సమాచారం ప్రకారం అయితే ఈ ఏడాది డిసెంబర్ నెల క్రిస్మస్ బరిలో ఈ సూపర్ ప్రాజెక్ట్ ని నిలిపేలా ప్లాన్ చేస్తున్నారట.

పవన్ డేట్స్ అన్నీ కూడా సెట్ అయ్యినట్టు అయితే ఈ ఏడాది లోనే ఓజి రాక ఉంటుంది అని స్ట్రాంగ్ ఇన్ఫో ఇపుడు ఉంది. మరి ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఆర్ ఆర్ ఆర్ నిర్మాణ సంస్థ డీవీవీ వారు నిర్మాణం వహిస్తున్నారు.