ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఎన్నైతే భారీ హిట్స్ వచ్చాయో అంతకు మించే పలు భారీ డిజాస్టర్ చిత్రాలు కూడా వచ్చాయి. ఇక ఈ ఆగస్ట్ నెలలో అయితే టాలీవుడ్ నుంచి ఒక్క చిత్రం కూడా అంతగా రాణించలేదు. చిన్న చిత్రాల్లో ఏదో ఒకటి రెండు మినహా పెద్ద బాక్సాఫీస్ హిట్స్ కూడా లేవు.
కాగా తెలుగులో అయితే పెద్ద హీరో సినిమాగా వచ్చిన చిత్రం “భోళా శంకర్” కూడా బాక్సాఫీస్ దగ్గర డీలా పడింది. కానీ ఈ ఊహించని ఫలితం నుంచి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమా “జైలర్” చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలు కురిపించింది. సినిమా హక్కులు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల పంట ఇచ్చిన జైలర్.
ఇప్పుడు తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ షాకింగ్ నంబర్స్ సెట్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ టాక్ ప్రకారం ఈ చిత్రం ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇప్పుడు 95 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిందట. అలాగే ఫైనల్ గా 100 కోట్లకి పైగా అందుకుంటుంది అని అంటున్నారు. కాగా ఒక్క తెలుగు వెర్షన్ నుంచే 100 కోట్ల గ్రాస్ అయితే అది మామూలు విషయం కాదని చెప్పాలి.
ఆల్రెడీ యూఎస్ లో కూడా 1 మిలియన్ కి పైగా వసూళ్లు అందుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ బాగా రన్ అవుతుంది. దీనితో ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల మార్క్ కి వెళ్తుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అస్సలు ఈ నెంబర్ మాత్రం ఊహించనిదే అని చెప్పి తీరాలి.