షాకింగ్ : “జైలర్” ఓటిటి డేట్ ఫిక్స్??

లేటెస్ట్ గా సౌత్ ఇండియా సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా మారిన చిత్రం ఏదన్నా ఉంది అంటే సౌత్ ఇండియా సెన్సేషన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ కాంబినేషన్ లో తెరకెక్కించిన క్రేజీ ఎలివేషన్స్ చిత్రం “జైలర్” అనే చెప్పాలి.

ఈ ఏడాదికి అయితే తమిళ్ సహా సౌత్ ఇండియా సినిమా నుంచే అతి పెద్ద హిట్ ఇది కాగా ఈ సినిమా ఇపుడు ఏకంగా 600 కోట్ల మాసివ్ గ్రాస్ ని టచ్ చేస్తుంది. మరి గత ఆగస్ట్ 10న థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు స్టేట్స్ సహా తమిళ్ మరియు ఓవర్సీస్ మార్కెట్ లో భారీ రన్ తో దూసుకెళ్తుండగా ఈ గ్యాప్ లోనే ఓ షాకింగ్ బజ్ అయ్యితే బయటకి వచ్చింది.

కాగా ఈ అప్డేట్ తో అయితే జైలర్ ఓటిటి డేట్ లాక్ అయ్యినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రం ఓటిటి హక్కులు తమిళ సంస్థ సన్ నెక్స్ట్ వారు తీసుకోగా ఇందులో ఈ సినిమా ఊహించని విధంగా ఈ సెప్టెంబర్ 7 నుంచే వచ్చేస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీనితో థియేటర్స్ లో ఇంత సాలిడ్ గా రన్ అవుతున్న ఈ సినిమాకి ఇంత తొందర డేట్ షాకింగ్ అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో మోహన్ లాల్ మరియు శివ రాజ్ కుమార్ లు సెన్సేషనల్ క్యామియో పాత్రల్లో నటించగా తమన్నా, సునీల్ జాకీ ష్రాఫ్ లాంటి వారు నటించారు. అలాగే అనిరుద్ సంగీతం ఇచ్చిన ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మాణం వహించారు.