త్వరలో పెళ్ళి .. ఈలోపు భారీ షాకిచ్చిన కాజల్ అగర్వాల్ ..!

చందమామ కాజల్ అగర్వాల్ ఈ నెల 30 న ముంబై లోని స్టార్ హోటల్ లో గ్రాండ్ గా పెళ్ళి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇరుకుటుంబాల తో పాటు కాజల్ కి అత్యంత సన్నిహితులు, సినిమా తారలు కొంతమంది ఈ వేడుకకి హాజరు కానున్నారు. ఇక కాజల్ చేసుకోబోయో వరుడు ముంబై లో వ్యాపారం చేస్తుంటాడు. గత కొన్నేళ్ళుగా ఇద్దరు ప్రేమలో ఉండి..ఇటీవలే తమ ప్రేమ విషయాన్ని బహిర్గతం చేశారు.

Kajal Aggarwal Live Telecast Poster Goes Viral

అయితే పెళ్ళి హడావుడిలో ఉన్న కాజల్ ఇప్పట్లో తను నటించబోతున్న సినిమాలకి సంబంధించిన వార్తలు ఏవీ రావని అందరూ గట్టిగా ఫిక్సై ఉన్నారు. కాని ఊహించని విషంగా ఈ చందమామ అందరికీ షాకిచ్చింది. ఇంతకాలం భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న కాజల్ మొదటిసారి వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకుంది. కాగా ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన కాజల్ లుక్ రిలీజై అందరికి భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది.

కాజల్ అగర్వాల్ నటిస్తున్న డెబ్యూ వెబ్ సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’ కి సంబంధిన పోస్టర్ రిలీజైంది. పోస్టర్ ని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది కాజల్. ఈ పోస్టర్ లో కాజల్ ఓ ఘోస్ట్ గా కనిపిస్తోందని వెల్లడైంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో వైభవ్, ఆనంది ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘లైవ్ టెలికాస్ట్’ సిరీస్ 7 ఎపిసోడ్స్ గా ప్రసారం అవుతుండగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.