రాజ్ తరుణ్ ప్రేమలో శివాని రాజశేఖర్… పుకార్లపై శివాని స్టన్నింగ్ సమాధానం!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటీనటులుగా ఎంతో గుర్తింపు పొందిన జీవిత రాజశేఖర్ గురించి అందరికీ సుపరిచితమే ఇక వీరి వారసురాళ్లుగా ఇండస్ట్రీలోకి శివాని శివాత్మిక ఇద్దరూ హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఇలా వీరిద్దరూ పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే గతంలో వీరిద్దరి గురించి కొన్ని వార్తలు షికార్లు చేశాయి. ఇండస్ట్రీలో ఉన్న తర్వాత సెలబ్రిటీల గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడం సర్వసాధారణం.

ఇకపోతే శివాని శివాత్మక గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో వీరు ఆ వార్తలపై స్పందించి సంజాయిషీ ఇచ్చుకున్నారు.ఇకపోతే తాజాగా శివాని హీరో రాజ్ తరుణ్ తో కలిసి ఆహనా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ లో నటించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ 5 లో ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో హీరో రాజ్ తరుణ్ శివాని గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

శివాని రాజ్ తరుణ్ ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రావడంతో ఈ వార్తలపై ఎట్టకేలకు శివాని స్పందించి తన స్టైల్ లో సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా శివాని మాట్లాడుతూ తనకు రాజ్ తరుణ్ ఒక మంచి ఫ్రెండ్ అని ఈమె సమాధానం చెప్పారు.ఇలా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని అంతకుమించి మరేమీ లేదంటూ ఈమె క్లారిటీ ఇచ్చారు.ఇక మా ఇద్దరి మధ్య ప్రేమ ఉండి పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా మేమిద్దరం కనుక పెళ్లి చేసుకుంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి అంటూ ఈమె సమాధానం చెప్పారు.

Shivani Rajasekhar Clarity About Her Fake News | Raj Tarun | Aha Naa Pellanta | Sakshi TV Cinema