థియేటర్లు తెరుచుకోవా! ఇక సినిమాలన్నీ డిజిటల్ రిలీజులేనా!శర్వానంద్ సినిమా కూడా అంతేనా !

sharwanand new movie also releages in digital plotform

కరోనా దెబ్బకు సినిమాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ పడడంతో థియేటర్ల బంద్ తో నిర్మాణం పూర్తయి, విడుదలకు రెడీ అయిన సినిమాలు కూడా మూలనపడిపోయాయి. దీంతో కొందరు నిర్మాతలు ఓటీటీ ప్లాట్ ఫాంలను ఎంచుకుంటున్నారు. నాని హీరోగా, దిల్ రాజు నిర్మించిన ‘వి’ చిత్రం కూడా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ అయిపోయింది. దిల్ రాజు వంటి నిర్మాతే అలా డిజిటల్ రిలీజ్ ఎంచుకోవడంతో, మరికొందరు నిర్మాతలు కూడా ఆ మార్గాన్నే అనుసరించడానికి సిద్ధమవుతున్నారు.

sharwanand new movie also releages in digital plotform
sharwanand new movie also releages in digital plotform

ఈ క్రమంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’ చిత్రం కూడా ఓటీటీ ద్వారా డైరెక్టు రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. నూతన దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వాస్తవానికి మొన్న వేసవిలోనే విడుదల కావాలి. థియేటర్లు మూతపడడం వల్ల ఆగిపోయింది. ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం సాధ్యపడదన్న వార్తలు వస్తుండడంతో నిర్మాతలు డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.