జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే దర్శకుడు కొరటాల శివ గ్రాండ్ గా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలు ఊహించని స్థాయిలోనే ఉంటాయట. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో దర్శకుడు సరికొత్తగా ఈ సినిమాను ప్రజెంట్ చేయబోతున్నాడు.
ఇక ప్రతి సన్నివేశం గురించి జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి సన్నివేశాన్ని పర్ఫెక్ట్ గా షూట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులోని ఒక ప్రత్యేకమైన గ్రీన్ మ్యాట్ సెట్ లో విజువల్ ఎఫెక్ట్స్ టీం తో కలిసి ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు.
సముద్రంలో జూనియర్ ఎన్టీఆర్ చేసే ఒక యాక్షన్ సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్ కాబోతుందట. అయితే అందులో జూనియర్ ఎన్టీఆర్ షార్క్ తో చేసే ఫైట్ ఇంకా మరొక లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఏదో నామమాత్రంగా కాకుండా ఆ ఫైట్ వెనుక ఒక బలమైన కారణాన్ని కూడా దర్శకుడు చూపిస్తాడట.
ఇక సినిమాకు అత్యంత కీలకమైన ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ కూడా ముందుగానే వర్క్ షాప్ లో పాల్గొన్నాడు. మొత్తానికి ఆ ఎపిసోడ్ అయితే సినిమాకు చాలా బలం చేకూర్చే అవకాశం ఉందట. దేవర సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేసి 2024 ఏప్రిల్ లో గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక అక్టోబర్ తర్వాత ఫస్ట్ లుక్ టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.