హమ్మయ్య..”గేమ్ చేంజర్” పై అప్డేట్ ఇచ్చిన శంకర్ 

ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అని కూడా లేదు. అన్ని ఇండస్ట్రీల నుంచి కూడా సినీ ప్రముఖులు అంతా కూడా ఒకొకరితో కలిసి భారీ చిత్రాలు చేస్తున్నారు. తమిళ హీరోలు తెలుగు దర్శకులతో తెలుగు హీరోలు తమిళ దర్శకులు కన్నడ హిందీ దర్శకులతో కూడా చేస్తున్నారు.

మరి అలా మన తెలుగు హీరో రామ్ చరణ్ తమిళ సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న సినిమానే “గేమ్ చేంజర్”. ఈ సినిమా ఎప్పుడో మొదలైంది కానీ షూటింగ్ మాత్రం అలా కొనసాగుతూనే వస్తుంది. దీనితో అసలు సినిమా పరిస్థితి చాలా మందికి అర్ధం కాలేదు. పైగా ఈ మధ్య అయితే బాగా గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ చిత్ర యూనిట్ కి వార్నింగ్ లు కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు.

దీనితో అసలు ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నగా మారగా ఇప్పుడు ఫైనల్ గా సినిమాపై నేరుగా దర్శకుడు శంకర్ బిగ్ అప్డేట్ అందించారు. తాను నిన్నటి నుంచే హైదరాబాద్ లో గేమ్ చేంజర్ షూట్ ని అయితే స్టార్ట్ చేసినట్టుగా రామ్ చరణ్ తో కలిసి పిక్ ఒకటి సినిమా సెట్స్ నుంచి రిలీజ్ చేశారు.

చరణ్ కి ఏదో సీరియస్ సీన్ కి వివరిస్తున్నట్టుగా ఈ పిక్ చూస్తే అర్ధం అవుతుంది. దీనితో మాత్రం చాలా రోజులు నుంచి అసలు సినిమా ఉందా లేదా అప్డేట్ ఏది లేదు అనుకునే సమయంలో శంకర్ ఇచ్చిన ఈ అప్డేట్ కాస్త ఫ్యాన్స్ కి ఊరటనిచ్చింది. ఇంకా ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
https://x.com/shankarshanmugh/status/1711736613112545719?s=20