“OG” నుంచి సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా “ఓజి” కూడా ఒకటి. ఒక పక్కా మాస్ ఏక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి అయితే చిత్ర యూనిట్ ఓ సెన్సేషనల్ అప్డేట్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేసారు.

ఓ ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియోని అయితే చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ఇందులో పవన్ పై ఎలాంటి విజువల్స్ కూడా లేకుండానే ఓ రేంజ్ లో హైప్ ని రేపారు. కాగా ఈ సినిమా అయితే దర్శకుడు సుజీత్ సినిమా స్క్రిప్ట్ ని ఎలా స్టార్ట్ చేసి ది ఎండ్ ఎలా ఇచ్చాడో ఎంతకష్టపడ్డాడో ఇంట్రెస్టింగ్ వే లో అయితే చూపించారు.

అలాగే గన్స్ కత్తులతో విధ్వంసకర ఏక్షన్ ని అయితే మేకర్స్ చూపిస్తున్నారు. అలాగే సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన స్కోర్ కూడా ఈ వీడియోలో సినిమా థీమ్ కి తగ్గట్టుగా ఓ రేంజ్ లో అనిపిస్తుంది. అలాగే ఈ వీడియో తోనే ఓజి షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఇక ఈ సినిమాని అయితే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏప్రిల్ 17 నుంచి చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వదిలి ముంబై లో షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. కొన్ని రోజులు పాటుగా ఈ షూటింగ్ అయితే జరుపుకోనుంది.