ఇండస్ట్రీ టాక్ : పవర్ “ఓజి” కి సెన్సేషనల్ ఓవర్సీస్ ఆఫర్?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్కెట్ కోసం కానీ పవర్ స్టార్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ కోసం కానీ తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పవర్ స్టార్ తన రేంజ్ సినిమాలు చేసి చాలా కాలమే కాగా ఇపుడు తాను చేస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రమే “ఓజి”.

అది కూడా స్ట్రైట్ సినిమా ఇది కావడంతో అయితే అయితే ఊహించని లెవెల్ హైప్ దీనిపై ఉంది. యంగ్ దర్శకుడు సుజీత్ చేస్తున్న ఒకో ఇంట్రెస్టింగ్ స్టెప్ సినిమాపై పాన్ ఇండియా వైడ్ హైప్ ని తీసుకొస్తుండగా ఓవర్సీస్ లో ఉన్న పవన్ ఫ్యాన్స్ లో కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ ని సెట్ చేసి పెట్టింది ఈ చిత్రం.

ఇక దీనితోనే ఈ భారీ చిత్రానికి యూఎస్ లో మాసివ్ డీల్ ఆఫర్ వచ్చినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ ఒకటి వైరల్ గా మారింది. దీనితో ఈ చిత్రానికి 2.5 మిలియన్ డాలర్స్ ఆఫర్ తో ఓ మాసివ్ డీల్ బిజినెస్ గా వచ్చిందట. దీనిని మేకర్స్ లాక్ చేశారు అని కూడా తెలుస్తుండగా ఇది మన ఇండియన్ కరెన్సీలో అయితే 18 కోట్లకి పైగానే డీల్ అన్నట్టు తెలుస్తుంది.

అయితే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ తన సింపుల్ రీమేక్ చిత్రం “భీమ్లా నాయక్” తోనే 2.2 మిలియన్ కి పైగా వసూళ్లు రాబట్టేసాడు. పైగా అప్పట్లోనే అజ్ఞ్యాతవాసి లాంటి డిజాస్టర్ తో కూడా 2 మిలియన్ వసూళ్లు వచ్చిన సత్తా పవన్ కళ్యాణ్ ది ఇక ఓజి ఇది స్ట్రైట్ సినిమా కావడం ఇది కానీ హిట్ అయితే మొదటి వీకెండ్ లోనే పెట్టుకున్న టార్గెట్ డెఫినెట్ గా రీచ్ అయ్యిపోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు.