వైరల్ : “కేజీఎఫ్ 3” పై సెన్సేషనల్ హింట్.!

గత ఏడాది సరిగా ఇదే సమయానికి ఇండియన్ సినిమా దగ్గర మరో మోస్ట్ అవైటెడ్ భారీ పాన్ ఇండియా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమానే “కేజీఎఫ్ చాప్టర్ 2”. చాప్టర్ 1 మాసివ్ హిట్ కావడంతో దీనిపై అమాంతం హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది.

ఇక ఈ భారీ సినిమా అయితే రిలీజ్ అయ్యి రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేయడమే కాకుండా గత ఏడాది మన తెలుగు హిట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ ని దాటి హైయెస్ట్ గ్రాసర్ గా అయితే నిలిచింది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యాక మళ్ళీ చాప్టర్ 3 కూడా ఉందని హింట్ ఇవ్వడంతో ఇక ఈ సినిమా లవర్స్ కి పూనకాలు వచ్చినట్టు అయ్యింది.

కానీ తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయడానికి చాలా సమయం పడుతుంది అని మేకర్స్ క్లారిటీ ఇవ్వగా నేటితో చాప్టర్ 2 వచ్చి అయితే ఏడాది అయ్యింది. దీనితో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నుంచి అయితే ఓ మాసివ్ వీడియో కట్ వచ్చింది. అయితే ఇందులో కేజీఎఫ్ చాప్టర్ 3 కోసం ఇంట్రెస్టింగ్ హింట్స్ ని లాస్ట్ లో రివీల్ చేయడం ఆసక్తిగా మారింది.

రాకీ కేజీఎఫ్ ని బాంబులతో పేల్చేయడం అలాగే రాకీ బంగారాన్ని అంతా సముద్రంలోకి తీసుకెళ్లడం విజువల్స్ ని ఇంట్రెస్టింగ్ గా రివర్స్ లో చూపించారు. అంతే కాకుండా రాకీ తన తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు అంటూనే మళ్ళీ నిలబెట్టుకున్నాడా? అంటూ సరికొత్త ప్రశ్న లేపి చాప్టర్ 3 ని కన్ఫర్మ్ చేసి సెన్సేషనల్ హిట్ ఇచ్చారు.

దీనితో ఈ ఏడాది తర్వాత చాప్టర్ 3 పై బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చినట్టు అని చెప్పాలి. కాగా ఈ సినిమా అయితే ఇంకా స్టార్ట్ కావడానికి సమయం తీసుకుంటుంది. ఇక యష్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ లో నటించారు.