“లియో” లో టాలీవుడ్ స్టార్? వైరల్ గా సెన్సేషనల్ బజ్.!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఒక భాష నుంచి మరో భాషలో నటులు దర్శకులు వర్క్ చేస్తూ ఉండడం కామన్ అయ్యింది. మరి ఈ క్రేజీ లైనప్ లో అయితే లేటెస్ట్ గా ఓ ఊహించని కాంబినేషన్ మూవీ లవర్స్ కి ట్రీట్ ఇచ్చేలా తమిళ సినిమా నుంచి దర్శకుడు లోకేష్ కనక రాజ్ అయితే డిజైన్ చేసాడు.

తన విక్రమ్ సినిమాతో ఒక సరికొత్త సినిమాటిక్ అందులోని లాజికల్ యూనివర్స్ కి గేట్లు తెరిచి క్రేజీ ట్రీట్ ని ఫ్యాన్స్ కి అందించాడు. ఇక ఇపుడు కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకడైన విజయ్ తో భారీ చిత్రం “లియో” చేస్తుండగా ఇందులో కూడా భారీ తారాగణం అయితే డిజైన్ చేసాడు.

అటు హిందీ నుంచి సంజయ్ దత్ ని సినిమాలో తీసుకోగా మరి మన తెలుగు నుంచి కూడా ఓ స్టార్ ని తీసుకున్నట్టుగా ఇప్పుడు టాక్ ఊపందుకుంది. పైగా ఆ స్టార్ మరెవరో కూడా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ ఓ టాక్ ఇపుడు వైరల్ గా మారిపోయింది.

సినిమా ఫస్ట్ గ్లింప్స్ లోనే తెలుగు స్టేట్స్ రిజిస్ట్రేషన్ తో కార్ లు కనిపించాయి దీనితో తెలుగు కనెక్షన్ కూడా సినిమాకి ఉంది అని కన్ఫర్మ్ అయ్యింది. అలాగే చరణ్ తో సినిమా కూడా ఉంటుందని లోకేష్ ఎప్పుడో కన్ఫర్మ్ చేసాడు వీటితో పాటుగా విక్రమ్ తర్వాత ఈ చరణ్ లోకేష్ సినిమాల్లో కనిపిస్తాడని కూడా టాక్ రాగ.

ఇపుడు చరణ్ లియో చిత్రంలోనే కనిపిస్తాడు అని సెన్సేషనల్ బజ్ ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది. దీనితో రామ్ చరణ్ ఈ సినిమాలో ఉన్నాడని ఆల్ మోస్ట్ ఖరారు అంటున్నారు. మరి దీనిపై సిసలైన క్లారిటీ రావాల్సి ఉంది.