Laila : మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వననున్న సొట్టబుగ్గల సుందరి…!

Laila : పాత తరం నటి అయిన లైలా తన చిలిపి నవ్వుతో కుర్ర కారు మనసుల్ని కొల్లగొట్టిన ఈ సొట్ట బుగ్గల సుందరి శ్రీకాంత్, జేడీ చక్రవర్తి సినిమా ఎగిరే పావురం లో నటించి అందర్నీ ఆకట్టుకుంది. బాలకృష్ణ వెంకటేష్ లాంటి అగ్రహీరోల సరసన నటించిన లైలా తమిళం లో కూడా మంచి సినిమాలు చేసింది.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోల సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటిస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది లైలా.. ఇక తమిళం లో సూర్య సరసన శివ పుత్రుడు లో నటించిన లైలా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఒక బిజినెస్ మ్యాన్ ని వివాహమాడి సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ భామ ప్రస్తుతం రీ ఎంట్రీ అవకాశాల కోసం ఎదురుచుస్తున్నదట.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం లైలా.. కోలీవుడ్ హీరో కార్తీ నటిస్తున్న సర్దార్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందట. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ రెండు విభిన్నమైన గెటప్పులో కనిపించనున్నాడు. ఒకటి యంగ్ పోలీసాఫీర్ పాత్ర అయితే.. మరొకటి 60 ఏళ్ల వృద్ధుడి పాత్ర.. ఎంతో ఛాలెంజిగ్ గా కార్తీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో లైలా ఒక కీలక పాత్రలో నటిస్తుందని, ఈ సినిమాతో అమ్మడికి మంచి పేరు వస్తుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏదిఏమైనా అన్నతో హిట్ అందుకున్న ఈ భామ .. ఇప్పుడు తమ్ముడితో రీ ఎంట్రీ ఇవ్వడం కొద్దిగా ఆశ్చర్యమే.. మరి ఈ అవకాశం తో లైలా తెలుగులోనూ బిజీగా మారుతుందేమో చూడాలి.