తాను బ్రతికుండగానే తన కూతురు చనిపోవాలన్న సీనియర్ ఆర్టిస్ట్.. కారణం తెలిస్తే షాక్..?

ప్రపంచంలో తల్లి ప్రేమకు ధనిక , పేద అని ఎటువంటి భేదాలు ఉండవు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేయటం కోసం నిరంతరం కష్టపడుతూ వారి జీవితాలను త్యాగాలను చేసి మరి పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో ఎంతోమంది తల్లిదండ్రులు వయసు పైబడిన కూడా పిల్లల కోసం కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో సినిమాలలో సీరియల్స్ లో నటించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇందు ఆనంద్ గారు కూడా తన కూతురి కోసం ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన హిందూ ఆనంద్ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా చక్రవాకం, మొగలిరేకులు, కల్యాణ వైభోగమే వంటి సీరియల్స్ లో నటించిన హిందూ ఆనంద్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

అయితే ఇలా తన నటనతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఇందు ఆనంద్ జీవితంలో కూడా ఒక పెద్ద విషాదం ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇందు ఆనంద్ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎన్నో విషయాలను వెల్లడించారు. కేరళకు చెందిన ఇందు ఆనంద్ వివాహం జరిగిన తర్వాత తన భర్త ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే తన కూతురు పుట్టుకతోనే అనేక ఆరోగ్య సమస్యలలో పాటు మానసిక ఎదుగుదల కూడా లేదు. ఇందు ఆనంద్ తన భర్త మరణించిన తర్వాత తన కూతురికి అన్నీ తానై చూసుకుంటుంది.

ఇప్పటికి తన కూతురి కోసం కష్టపడి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది. ఇప్పటికే మూడు సర్జరీలు చేయించుకున్న ఇందు తన కూతురు బాగోగులు చూసుకోవటానికి లోటు లేకుండా ఉండాలని ఈ వయసులో కూడా కష్టపడి పని చేస్తుంది. సాధారణంగా ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలను నిండు నూరేళ్లు బ్రతకాలని ఆశిస్తారు. కానీ ఇందు ఆనంద్ మాత్రం తాను బ్రతికుండగానే తన కూతురు మరణించాలని కోరుకుంటోంది. ఒకవేళ తన కూతురి కన్నా తనం ముందుగా చనిపోతే మానసిక ఎదుగుదలలేని తన కూతుర్ని చూసుకోవటానికి ఎవరు ఉండరని, తాను ఒంటరై పోతుందని ఇందు ఆనంద్ ఇలా మాట్లాడారు. అందువల్ల తాను ఇంకా బ్రతికుండగానే తన కూతురు చనిపోతే తన కూతురు గురించి దిగులు ఉండదని ఆవిడ కన్నీరు పెట్టుకున్నారు.