ఆస్పత్రి బెడ్ పై సీనియర్ నటి కుష్బూ.. ఏం జరిగిందంటూ ఆందోళనలో అభిమానులు?

దక్షిణాది సినీ పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి కుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో ఏం హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే కుష్బూ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా కుష్బూ ఒక ఫోటోని షేర్ చేశారు. అయితే ఈమె ఉన్నఫలంగా ఆసుపత్రి బెడ్ పై ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఇందులో ఈమె చేతికి సెలైన్ కూడా పెట్టడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.అయితే తనకు ఏం జరిగిందనే విషయాన్ని కూడా ఈమె తెలియజేశారు. తను గత కొన్ని రోజులు నుంచి వెన్ను సమస్యతో బాధపడుతున్నారని తద్వారా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని తెలిపారు. అయితే తాను చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి వచ్చానని, ఇలా ఆలస్యంగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు క్షమించమని ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఇకపోతే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగుందని మరో రెండు మూడు రోజులలో తన రోజు వారి కార్యక్రమాలలో పాల్గొనబోతున్నానని కుష్బూ వెల్లడించారు. ఇకపోతే కుష్బూ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ ఫోటోపై స్పందిస్తూ మీరు త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్నారు అదేవిధంగా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా జడ్జిగా ప్రేక్షకులను సందడి చేస్తూ బిజీగా ఉన్నారు.