బాలీవుడ్ లో రిలీజ్ కానున్న సీతారామం.. రిలీస్ డేట్ ఫిక్స్..?

తెలుగులో విడుదలైన కొన్ని ప్రేమకథ సినిమాలు ప్రేక్షకులు మనసుని బాగా హత్తుకున్నాయి. ఇటీవల విడుదలైన సీతారామం సినిమా కూడా ప్రేక్షకుల మనసుని హత్తుకునేలా ఉంది. ఇటీవల విడుదలైన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం భాషలలో విడుదలై మొదటి రోజు నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి హీరోయిన్ గా మంచి గుర్తింపు లభించటంతో పాటు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి.

రష్మిక , తరుణ్ భాస్కర్, భూమిక, గౌతమ్ మీనన్, సుమంత్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు విశాల్ చంద్ర అందించిన సంగీతం సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తొందరలోనే బాలీవుడ్ లో కూడా విడుదల కానుంది. ఇప్పటికీ హిట్ సినిమాలు లేక సతమతమవుతున్న బాలీవుడ్ లో ఈ లవ్ స్టోరీ సినిమా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఇటువంటి ప్రేమ కథ సినిమాలను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

అందువల్ల సెప్టెంబర్ రెండవ తేదీన హిందీలో ఈ సినిమా విడుదల చేయడానికి సిద్ధమైనట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమా హిందీలో విడుదలైతే ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుందో చూడాలి మరి. ఇదిలా ఉండగా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ కి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా ఈ అమ్మడు సెలెక్ట్ అయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పక్కన నటిస్తే ఈ అమ్మడి రేంజ్ పెరుగుతుందనిటంలో ఏమాత్రం సందేహం లేదు.