టెలివిజన్లో ప్రసారం కానున్న సీతారామం… ఏ ఛానల్లో తెలుసా?

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం.హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అద్భుతమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు తమిళ, మలయాళ భాషలలో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా హిందీలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ విధంగా సీతారామం సినిమా ద్వారా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన నటుడు దుల్కర్ సల్మాన్ కు సైతం తెలుగులో విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.

అందమైన ప్రేమ కథ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతోమంది హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి.ఇలా థియేటర్లో సుమారు 80 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యే అక్కడ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఆగస్టు 5వ తేదీ థియేటర్లో విడుదలైనటువంటి ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది.

ఇకపోతే త్వరలోనే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా స్టార్ మా లో ప్రసారం కానున్నట్లు స్టార్ మా అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ సినిమా టెలికాస్ట్ తేదీని కూడా త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. థియేటర్లోనూ, ఓటీటీలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ గా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.