Satya Dev: ప్రముఖ నటుడు సత్యదేవ్ అంటే అందరికీ బాగా తెలుసు. అయితే విశాఖపట్నంలో షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా తన వృత్తిని ప్రారంభించిన అతను 2011 లో మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు. ఆ తరువాత అతను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ముకుంద చిత్రాలలో నటించాడు.
జ్యోతి లక్ష్మి చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఇక ఈ చిత్రం తక్కువ బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది. కానీ అతనికి చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ప్రకాష్ రాజ్ తో కలిసి మనఊరి రామాయణం లో నటించే అవకాశం దక్కింది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మోహన్ రాజా, నయనతార, సత్యదేవ్ పాత్రలు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సత్యదేవ్ గాడ్ ఫాదర్ ఆఫర్ గురించి ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నాడు.
ఈ కథ స్వయంగా చిరునే సత్యదేవ్ కి చెప్పారట. చిరంజీవి అన్నయ్య ఒక షూటింగ్ లో లంచ్ కి రమ్మని పిలిస్తే వెళ్లాను. ఒక సినిమా ఉందని కథ చెప్పడం మొదలుపెట్టారు. నేను షాకింగ్ గా చూసాను. అన్నయ్య నాకు కథ చెప్పడం ఏమిటని ఆశ్చర్యంగా చూశాను.
నేను ఎప్పుడూ కలలో కూడా కనని వింత అనుభవం అది. నేను ఆయనకి వీర అభిమానిని, నేను గురువుగా భావించిన వ్యక్తి ఆయన. అలాంటిది ఆయన నాకు కథ, పాత్ర చెప్పడం ఆశ్చర్యమనిపించింది. ఆయన నా వంక చూసి ”నేను సరిగ్గా కథ చెప్పడం లేదా? పోనీ దర్శకుడితో చెప్పానా ?” అని అడిగారు.
”మీరు నాకు కథ చెప్పడం ఒక కలలా వుంది, నాకేం అర్ధం కావడం లేదయ్యా.. మీరు చేయమని చెప్తే చేస్తాను.. మీరు కథ చెప్పడం ఏంటి ” అన్నాను. సినిమా చూశావా ? అని అడిగారు. ”చూడలేదు, చూడను కూడా. చేస్తాను” అని చెప్పా. ఆయన అడిగిన తర్వాత మళ్ళీ చూసే ఆలోచన లేదు.
చిరంజీవితో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్న సత్యదేవ్..
ఆ క్షణం చాలా గొప్పగా అనిపించింది. అయితే పాత్ర చేస్తున్నపుడు అందులో వున్న లోతు కొంచెం అర్ధమైంది. తర్వాత చిన్న టెన్షన్ కూడా మొదలయింది” అంటూ చిరంజీవితో తన అనుభవాన్ని పంచుకున్నాడు.