చిరంజీవితో తలపడతాడా?.. సత్యదేవ్‌ది సాహసమే!!

Satya Dev In Chiranjeevi Lucifer Remake

రెండ్రోజుల క్రితం సత్యదేవ్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఏడాది గడించేందుకు వచ్చింది.. ఇలాంటి ఓ ఫోటోను షేర్ చేయకుండా గుడ్ బై ఎలా చెప్పగలను అంటూ చిరుతో దిగి ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ను అందరికీ పరిచయం చేశాడు సత్యదేవ్. మామూలుగానే సత్యదేవ్ చిరు అభిమాని. చిన్న తనం నుంచి కూడా హీరో అనే పదానికి నిర్వచనం అంటే చిరు అని తెలుసుకున్నాను, విన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మధ్య లాక్డౌన్‌లో చిరు సత్య దేవ్‌ను స్పెషల్‌గా కలిశాడు.

Satya Dev In Chiranjeevi Lucifer Remake
Satya Dev In Chiranjeevi Lucifer Remake

బ్లఫ్ మాస్టర్ సినిమాను వీక్షించిన చిరు… సత్య దేవ్ నటనను అభినందించాడు. ఈ మేరకు చిరుతో మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన విషయాలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా సత్య దేవ్‌కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. చిరంజీవితో తలపడే పాత్రే వచ్చినట్టు సమాచారం అందుతోంది. లూసిఫర్ రీమేక్‌ను చిరు పట్టాలెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్రను సత్య దేవ్‌కు ఇచ్చేందుకే ఆ మీటింగ్ జరిగినట్టుంది.

లూసిఫర్ సినిమాలో ఎన్నో ముఖ్య పాత్రలున్నాయి. హీరోకు సపోర్ట్ చేసే మాఫియా, హీరోను ఎదుర్కొనే విలన్, హీరో అంటే పడని సోదరి ఇలా చాలా పాత్రలున్నాయి. ఒరిజినల్‌లో విలన్‌గా నటించిన వివేక్ ఒబేరాయ్ పాత్రలో సత్య దేవ్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవితో సత్య దేవ్ ఫైట్ చేసే సాహసం చేస్తాడా? అన్నది చూడాలి. ఏది ఏమైనా ఈ రీమేక్‌ను మాత్రం చిరు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ రీమేక్‌ను ఎడిటర్ మోహన్ తనయుడు జయం రాజా తెరకెక్కిస్తున్నాడు.