‘సారంగదరియా’ చిత్రం నుంచి సాంగ్ విడుదల!

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజా రవీంద్ర ప్రధానపాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమాతో పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సైజా క్రియేషన్స్‌పై ఉమాదేవి, శరత్‌చంద్ర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ప్రమేషన్స్‌లో భాగంగా ఇప్పటికే సినిమా నుంచి ‘అందుకోవా..’ అంటూ సాగే పాటను విడుదల చేయగా యూత్‌ను ఆకట్టుకుంటుంది.

ఇప్పుడు తాజాగా హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా మేకర్స్‌ టీజర్‌ విడుదల చేయించారు. మధ్యతరగతి కుటుంబంలో జరిగే చిన్ని చిన్ని ఎమోషన్స్‌, గొడవలు, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు ఇలా అన్ని ఎలిమెంట్స్‌ కలిపితే ఎలా ఉంటుందో ఈ టీజర్‌ అలా సాగింది.

రాజా రవీంద్ర చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో తండ్రి పాత్రలో కొత్తగా కనిపిస్తున్నాడు. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శివ చందు, యశస్విని, మొయిన్‌, మోహిత్‌, నీల ప్రియా, కాదంబరి కిరణ్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎబెనెజర్‌ పాల్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వినయ్‌ కొట్టి, కెమెరా: సిద్దార్థ స్వయంభు.