Game Changer: గేమ్ ఛేంజర్ లెక్క మార్చిన వెంకీ సినిమా!

ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి మూడు భారీ చిత్రాలు విడుదలైన విషయం తెలిసిందే. బడ్జెట్, బిజినెస్ పరంగా గేమ్ చేంజర్ ముందు వరుసలో ఉండగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ నెమ్మదిగా బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. వెంకీ మామ సినిమాకు ఊహించని స్పందన రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

‘గేమ్ చేంజర్’ భారీ స్క్రీన్ కౌంట్‌తో ముందుగా థియేటర్లలోకి దిగింది. అయితే, సినిమా మొదటి వారంలోనే ఆక్యుపెన్సీ తగ్గడం ప్రారంభమైంది. మరోవైపు రెండు రోజుల గ్యాప్‌లో వచ్చిన ‘డాకు మహారాజ్’ బాగా ఆడుతుండగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మొదటి రోజే హౌస్ ఫుల్ కలెక్షన్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే వెంకీ సినిమా డిమాండ్‌కు తగిన స్క్రీన్లు లేకపోవడం వల్ల ప్రేక్షకులు టికెట్లు దొరక్క ఇబ్బంది పడ్డారు.

ఈ పరిస్థితిని గమనించిన నిర్మాత దిల్ రాజు రికార్డులకంటే బిజినెస్‌ను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి ‘గేమ్ చేంజర్’ స్క్రీన్లను తగ్గించి, ఎక్కువ స్క్రీన్లను ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు కేటాయించారు. వెంకటేశ్ సినిమాకు మౌత్ టాక్ బలంగా ఉండటంతో వీకెండ్ వసూళ్లలో భారీగా రాబట్టే అవకాశం ఉందని ఆయన భావించారు.

‘గేమ్ చేంజర్’కు తక్కువ స్క్రీన్లలో కొనసాగితే సరిపోతుందని, ‘సంక్రాంతికి వస్తున్నాం’కి ఎక్కువ థియేటర్లు కేటాయిస్తే ఆదాయానికి మంచిదని దిల్ రాజు భావించారు. ఈ నిర్ణయం మెగా ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, వ్యాపార పరంగా దిల్ రాజు మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వీకెండ్ ముగిసేలోపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

పుష్పరాజ్ వేట || Analyst Dasari Vignan About Pushpa2 Re Release || Allu Arjun || Telugu Rajyam