సంజయ్‌లీలా భన్సాలి.. హీరామండి!

పీరియాడిక్‌ డ్రామా, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌, ప్రేమకథలు ఇలా జానర్‌ ఏదైనా కానీ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ. దేవదాస్‌, గంగూబాయి కతియావాడి, బాజీరావ్‌ మస్తానీ, రామ్‌ లీలా వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే భన్సాలీ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తాజా వెబ్‌ సిరీస్‌ ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’. ఈ చిత్రానికి భన్సాలీతో పాటు విభు పూరి, మితాక్షర కుమార్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌ తో డిజిటల్‌ ప్లాట్ ఫామ్‌ లోకి అడుగు పెడుతున్నారు భన్సాలీ.

ఈ సిరీస్‌ నెట్‌ప్లిక్స్‌లో నేరుగా విడుదల కానుండగా.. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్‌ లుక్‌ గమనిస్తే.. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్‌ హైదరీ, రిచా చద్దా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌లు మహారాణుల మాదిరిగా దర్శనం ఇచ్చారు.

ఒకే ఫ్రేమ్‌ లో అందాల తారలను దించేశారు. ఈ సిరీస్‌ కథ విషయానికి వస్తే.. ఇండిపెండెన్స్‌కు ముందు పాకిస్తాన్‌ లాహోర్‌లో ఉన్న వేశ్యల జీవితాల ఆధారంగా ఈ సిరీస్‌ రానున్నట్లు తెలుస్తుంది.