లేటెస్ట్ : “లియో” నుంచి సంజయ్ దత్ పై క్రేజీగా ఉన్న వీడియో.!

తమిళ సినిమా సహా ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న చిత్రాల్లో స్టార్ హీరో విజయ్ జోసెఫ్ హీరోగా క్రేజీ దర్శకుడు లోకేష్ కనగ రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం “లియో” కోసం అందరికీ తెలిసిందే. కాగా దీనిని భారీ అంచనాలు నడుమ గ్రాండ్ కాస్టింగ్ తో దర్శకుడు తెరకెక్కించగా.. 

ఈ చిత్రం నుంచి ఎప్పటికప్పుడు అదిరే అప్డేట్స్ ని అందిస్తుండగా గత కొన్నాళ్ల కితమే విజయ్ బర్త్ డే కానుకగా అదిరే పోస్టర్ ని అలాగే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయగా వాటికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చాయి. ఇక ఈ చిత్రం నుంచి అయితే ఈరోజు బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పై కూడా బిగ్ అప్డేట్ ని ఇప్పుడు అందించారు.

లోకేష్ కనగరాజ్ మార్క్ టేకింగ్ లో అయితే డిజైన్ చేసిన ఈ వీడియోలో సంజయ్ దత్ పాత్ర ఆంటోనీ దాస్ గా తన రోల్ ని రివీల్ చేసింది. అంతే కాకుండా ఇందులో విజువల్స్ తన లుక్స్ కూడా సూపర్బ్ గా ఉన్నాయి. అయితే ఇందులో బాగా గమనిస్తే బ్యాక్గ్రౌండ్ లో ఈగల్ కనిపిస్తుంది. మరి ఇది అయితే విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ ని రిప్రెజెంట్ చేస్తుంది.

దీనితో ఏజెంట్ విక్రమ్ కి సంజయ్ కి ఎమన్నా లింక్ ఉందా అనిపిస్తుంది. పైగా కమల్ ఏజ్ లోనే సంజయ్ ని కూడా చూపిస్తుండగా తన బ్యాచ్ కి ఏమన్నా సంబంధం ఉందా అని కూడా అనిపిస్తుంది. దీనితో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ వీడియోతో కన్ఫర్మ్ చేశారు.