టీజర్ టాక్ : “ఆనిమల్” తో మరోసారి స్ట్రైక్ చేసిన సందీప్ వంగ 

బాలీవుడ్ సినిమా దగ్గర ఇప్పుడు భారీ హిట్ గా షారుక్ ఖాన్ నటించిన సినిమా “జవాన్” నిలవగా ఈ సినిమా తర్వాత తెలుగు నుంచి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న చిత్రం “ఆనిమల్” కూడా ఒకటి. స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సౌత్ ఇండియా యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ అంతా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టీజర్ ని అయితే పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేశారు.

అయితే ఈ టీజర్ మాత్రం బాలీవుడ్ జనానికి పిచ్చ పిచ్చగా నచ్చేసింది అని అంటున్నారు. అయితే మనకి మాత్రం ఓ బాలీవుడ్ డబ్బింగ్ సినిమానే చూస్తున్నట్టే ఉంది. తెలుగు దర్శకుడు మళ్ళీ బాలీవుడ్ సినిమాలో చేసిన స్ట్రైట్ సినిమా లానే ఉందని చెప్పాలి. లాస్ట్ టైం కబీర్ సింగ్ లానే ఇప్పుడు అనిమల్ కూడా ఉందని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రంలో అయితే ఇంట్రెస్టింగ్ గా తండ్రీ కొడుకుల మధ్యలో ఎమోషన్స్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది.

అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ టేకింగ్ చాలా క్లియర్ గా ఇందులో కనిపిస్తుంది. ఆ యాంగర్ మేనేజ్మెంట్ తన తండ్రితో సీన్స్ వంగ మార్క్ లో సాలిడ్ గా ఉన్నాయి. అయితే ఈ సినిమాకి దర్శకుడు కథ అలాగే ఎడిటర్ కూడా సందీపే అందిస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే బాలీవుడ్ లో ఈ సినిమా టీజర్ తో మంచి అంచనాలే వచ్చాయి. ఈ డిసెంబర్ 1న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 
ANIMAL Teaser (Telugu): Ranbir Kapoor| Sandeep Reddy Vanga| Bhushan Kumar