ఒక్కోసారి హీరోయిన్లకు ఊహించని, అనుకోని సంఘటనలు ఎదురువుతుంటాయి. తాజాగా కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేకు అలాంటి ఘటనే ఎదురైంది. ఈ అమ్మడు కిర్రాక్ పార్టీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. తాజాగా ఈ హీరోయిన్ షేర్ చేసిన వీడియో, అందులో చేసిన కామెంట్స్, లైవ్‌లోనే తన టీ షర్ట్ తీసి చూపిన విధానం అన్నీ వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
సంయుక్త హెగ్డే తన స్నేహితులతో కలిసి ఎప్పటిలాగే ఉదయం పూట వర్కౌట్ల కోసం పార్కుకు వెళ్లింది. ఇక స్పోర్ట్స్ డ్రెస్సులో వారంతా అక్కడ వర్కౌట్లు చేసుకుంటున్నారట. స్పోర్ట్స్ డ్రెస్, బ్రా వేసుకుని నడుముకు రింగు పెట్టుకుని అటూ ఇటూ ఊగుతు వర్కౌట్లు చేసుకుంటూ ఉంటే ఓ మహిళ వచ్చి వారిని పచ్చి బూతులు తిట్టింది.అంతటి ఆగకుండా వారిపై దాడి చేసి, డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని బెదిరించిది.
ఈ తతంగాన్ని అంతా సంయుక్త హెగ్డే ఇన్‌స్టాగ్రాంలో లైవ్ పెట్టింది. పోలీసులు ఎంట్రీ ఇవ్వడం, అక్కడ జనాలు గుమి గూడటం, ఇరు వర్గాలు మాటల యుద్దాన్ని ప్రారంభించారు. ఇక సదరు మహిళ కూడా డ్రగ్స్ అంటూ ఆరోపణలు చేస్తూ ఉండటంతో అసలుసంగతి ఏంటన్నది అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో లైవ్‌లోనే తన టీ షర్ట్ తీసింది. ఇలా బ్రాలో ఉన్నందుకు, వర్కౌట్లు చేసుకుంటున్నందుకు ఆ మహిళ వచ్చి తమపై దాడి చేసిందని సంయుక్త వాపోయింది. ఇక ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ.. మనం నేడు చేసే పనులే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి అంటూ బెంగళూరు సిటీ కమిషనర్‌ను న్యాయం చేయమని కోరింది. ప్రస్తుతం సంయుక్త హెగ్డే వీడియో తెగ వైరల్ అవుతోంది