త్వరలో నానీ సినిమాకు డైరెక్షన్.. పవన్ కళ్యాణ్ తో కూడా..

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న సముథ్రకని మొదట్లో నటుడిగా అడుగులు వేశాడు. దర్శకుడిగా మారిన తరువాత యాక్టింగ్ కు దురమవుతున్నాడు అనే తరుణంలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఎలాంటి పాత్ర చేసినా కూడా సముథ్రకని ఒక స్పెష క్రేజ్ అందుకుంటూ వస్తున్నాడు. ఇటీవల తమిళ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా బాగానే చేస్తున్నాడు.

nani new movie ante sundaraniki title curtai riser
Natural star nani

అయితే ఈ మల్టీటాలెంటెడ్ పర్సన్ త్వరలో తెలుగు హీరోలను కూడా డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. శంభో శివ శంభో సినిమా తరువాత సముథ్రకని నానితో జెండాపై కపిరాజు అనే సినిమా చేశాడు. ఆ రెండు సినిమాలు అంతగా క్లిక్కవ్వకపోయినా కూడా దర్శకుడి మేకింగ్ కు కొంతమంది సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. అందులో రాజమౌళి ఒకరు.

చాలా వరకు సముథ్రకని నటుడిగా బిజీ అవ్వడం వల్ల సినిమాలను డైరెక్ట్ చేయలేకపోతున్నాడు. ఇటీవల క్రాక్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న ఈ నటుడు RRR సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక త్వరలో నాని కోసం రాసుకున్న కథను సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు చెప్పిన ఈ దర్శకుడు ప్రభాస్ ను కూడా డైరెక్ట్ చేయాలనినుందని అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ అప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు వివరణ ఇచ్చారు.