టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ చార్మింగ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అయితే మహేష్ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ఓ రేంజ్ లో హైప్ ఉంది. కానీ సినిమా స్టార్ట్ చేసిన నాటి నుంచి అయితే ఈ సినిమాకి ఎన్నో ఇబ్బందులు వాయిదాలు వచ్చాయి.
పైగా మహేష్ కూడా ఈ చిత్రాన్ని పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండానే చేస్తున్నట్టుగా కూడా రూమర్స్ ఉన్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం గ్లింప్స్ అయితే అదిరే రెస్పాన్స్ ని కొల్లగొట్టగా ఈ వీడియోని సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ ప్రింట్ తో అయితే అటాచ్ చేశారు.
ఇక ఇప్పుడు ఇదే స్ట్రాటజీ అయితే గుంటూరు కరం నుంచి రానున్న టీజర్ కి కూడా మేకర్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఈ ఆగష్టు లో 9న మహేష్ బర్త్ డే కానుకగా బిజినెస్ మెన్ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతుండగా దీనితో అయితే గుంటూరు కారం టీజర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కొన్ని ట్రస్టడ్ సినీ వర్గాలు చెప్తున్నాయి.
దీనితో అయితే ఆ రోజు మహేష్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ ఉంటుంది అని చెప్పాలి. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే పూజా హెగ్డే హెగ్డే మరియు లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
