సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్య నుండి విడాకులు పొందిన తర్వాత సౌత్ సినిమాలతో పాటు నార్త్ సినిమాలతో కూడా బిజీగా ఉంటున్న సమంత కొంతకాలంగా మీడియా ముందుకు రాకపోవడంతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె అనారోగ్యం పాలయిందని సమంత గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. గతంలో లాగే సమంత చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక తాజాగా సమంత గురించి మరోక వార్త నెట్టింట వైరల్ గా మారింది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మానసికంగా కృంగిపోయిన సమంత ఆ బాధ నుండి బయటపడటానికి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా మారిపోయింది. అయితే ఇటీవల సమంత అనారోగ్యం పాలైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా సమంత వేద పండితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా అందుకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత అనారోగ్యంగా ఉండటంవల్ల అనారోగ్యం నుండి బయటపడటానికి చికిత్స తీసుకోవటమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండటానికి ఇలా పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
అయితే ఆ ఫోటోలు ఇప్పటివా? లేక గతంలో నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి దేవాలయాలను సందర్శించిన సమయంలో తీసుకున్న ఫోటోలా? అని తెలియటం లేదు. సమంత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉండటంతో ఆమె గురించి అనేక రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సమంత స్పందించాల్సి ఉంటుంది. ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత నటించిన యశోద శకుంతల వంటి పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా కూడా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
