Samantha: వరుణ్ దావన్ తో సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ లో సామ్..!

Samantha : సమంత దక్షిణాదిన టాప్ హీరోయిన్లలో ఒకరు పెళ్లి తర్వాత ఆలోచించి కథా పరమైన సినిమాలు చేస్తున్న సమంత చైతూ తో విడాకుల తర్వాత మరింత జోరుగా సినిమాలు చేస్తోంది.అటు నార్త్ ఇటు సౌత్ ను కలుపుతూ ఏకంగా హాలీవుడ్ వైపు కూడా చూస్తోంది. వరుస ప్రాజెక్టులతో మిగతా హీరోయిన్ లకు చమటలు పట్టిస్తోంది. పాన్ ఇండియా సినిమాలైన శాకుంతలం, యశోదర షూటింగ్ లో పాల్గొంటూనే ఇంకో ప్రాజెక్ట్ కి ఒక చేసింది. విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటించనుంది సామ్. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 3కోట్లు డిమాండ్ చేసిందట.

ఇక ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తీసిన రాజ్ నిడిమోరు, కృష్ణ DK లతో మరోసారి వర్క్ చేయనుంది.అమెరికన్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ ను చిత్రీకరించే బాధ్యతను రాజ్ నిడిమోరు, కృష్ణ DK తీసుకున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్, సమంత నటించనున్నారు.

అయితే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జులై లో ప్రారంభం కానుందని తాజా సమాచారం. ఇందుకోసం వరుణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పనిలో ఉన్నాడట. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ముంబై, యూరప్ లలో జరగనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ లో నటించే ఇతర పాత్రల ఎంపిక జరుగుతుంది. ఇక అమెరికన్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా పాత్రలో ఇండియన్ వెర్షన్ లో సమంత నటించనుంది.