Samantha : సమంత, నాగ చైతన్య పెళ్లితో ఎలా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారో ఇక విడాకుల తర్వాత కూడా అంతే సోషల్ మీడియాలో ఇష్యూ అయ్యారు. ఎందుకు విడిపోతున్నారో కారణాలు చెప్పకపోవడంతో ఎవరికితోచింది వారు అనేసుకుంటూ యూ ట్యూబ్ మిగిలిన సామాజిక మధ్యమాల్లో హడావిడి చేసారు. ఇక ఇవేవి పట్టించుకోకుండా చై, సామ్ లు వారి జీవితాలలో బిజీగా ఉన్నారు. ఇక కెరీర్ పరంగాను జోరు పెంచారు.
ఇక సమంత తన సహచర నటులతోను , అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతో మంచి బంధాన్నే కలిగి ఉంది. సందర్బం వచ్చినపుడు వారి గురించి సోషల్ మీడియాలో స్పందిస్తూ పుట్టినరోజులకు విష్ చేస్తూ ఉంటుంది.ఇలాగే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ 40వ పుట్టినరోజుకు విష్ చేసింది. ఇక అఖిల్ 28వ పుట్టినరోజు కు తనకు విష్ చేసింది. విడాకుల తర్వాత ఇది ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.అయితే జరిగిన వివాదాలన్నీ పక్కనపెట్టి మాజీ మరిదికి సామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు పెట్టడం నిజంగా తన మంచి మనసుని తెలియజేస్తుంది అంటూ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు . అయితే సమంత పోస్టుకి అఖిల్ అస్సలు పట్టించుకోలేదు . కనీసం సామ్ కి రిప్లై కూడా ఇవ్వలేదు అఖిల్.
అదే రోజు బన్నీకి విష్ చేయగా.. సమంతకి అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వటం. ఈ ముగ్గురి మ్యాటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఖిల్ బర్త్ డే సందర్భంగా సామ్ పోస్ట్ పెడుతూ.. ‘ ఈ ఏడాదంతా మంచిగా జరగాలనీ, నువ్వు దేని కోసమైతే కలలు కంటున్నావో అవన్నీ నిజం కావాలని నేను దేవుడిని ప్రార్థిస్తాను అంటూ సమంత తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు సామ్.. అల్లు అర్జున్ కి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. టెర్రిఫిక్ పర్సన్ అల్లు అర్జున్ కి జన్మదిన శుభాకాంక్షలు. నీ అద్భుతమైన జర్నీలో నేను కూడా చిన్న భాగం అయినందుకు సంతోషంగా ఉంది అంటూ సమంత పోస్ట్ చేసింది. దీనికి ‘టచ్ చేశావ్.. థ్యాంక్యూ మై సామ్ అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. ఇపుడు ఈ పోస్ట్లు అంతర్జాలం లో హాట్ టాపిక్ అయ్యాయి..