టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత మూడు సంవత్సరాల పాటు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈమె పలు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇలా నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోవడంతో చాలామంది సమంతని తప్పుపడుతూ పెద్ద ఎత్తున ఆమె గురించి నెగిటివ్ కామెంట్ చేశారు. సమంతకు ఇతరులతో సంబంధం ఉండటం వల్లే ఈమె తనకు విడాకులు ఇచ్చిందని తిరిగి తనని పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే సమంత గురించి ఈ విధంగా నేటిజన్స్ కామెంట్ చేసినప్పటికీ ఈమె మౌనంగా వాటిని భరించింది.ఇకపోతే తాజాగా సమంత రెండో పెళ్లికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఆధ్యాత్మిక గురువు సద్గురు బాబాను ఎంతగానో విశ్వసిస్తారు. విడాకుల సమయంలో సమంతను మానసిక క్షోబ నుంచి బయటపడటం కోసం ఈమె సద్గురు ప్రవచనాలు వింటూ ఆ బాధ నుంచి బయటపడిందని తెలుస్తోంది. ఇక సద్గురు బాబాని సమంత తన తండ్రిగా భావించి ఆయన సూచనలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని సమంత పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు.
ఇకపోతే సమంత తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైందని వార్త మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈమెకు స్వయంగా సద్గురు బాబా తనని రెండో పెళ్లి చేసుకోమని సూచించారని ఆయనే స్వయంగా సమంతకు తగ్గ వరుడిని వెతికి పెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇలా సమంతకు సద్గురు సమక్షంలోనే రెండవ వివాహం చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో కొందరు ఈ వార్తలను కొట్టి పారేయగా మరి కొందరు రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంటూ సమంతకు మద్దతు తెలుపుతున్నారు.