ఆ విషయంలో పూర్తిగా భయ పడుతున్న సమంత.. మళ్లీ మొదటికి వచ్చిన తన జీవితం అంటూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .ఈమె తెలుగుతో పాటు తమిళంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం అవకాశాలను కోల్పోకుండా సమంత దూసుకుపోతోంది. అయితే కెరీర్ పరంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత తన వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడంలో ఫెయిల్ అయిందని చెప్పవచ్చు.

ప్రేమించుకొని పెద్దల సమక్షంలో నాగచైతన్య సమంత ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.నాలుగు సంవత్సరాలపాటు ఎంతో సంతోషంగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు రావటం చేత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ప్రస్తుతం వీరిద్దరూ వారి కెరీర్ పై దృష్టి సారించారు. ఇక సమంత విడాకులు ప్రకటన చేయడంతో కేవలం టాలీవుడ్ కోలీవుడ్ మాత్రమే కాకుండా హాలీవుడ్ బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది.

ఈ క్రమంలోనే ఈమె బాలీవుడ్ ఎంట్రీకి పలు చర్చలు జరుపుతుండగా హాలీవుడ్ సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ది అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌ పేరుతో పిలిప్ జాన్ డైరెక్షన్ లో సమంత హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఆడిషన్స్ లో పాల్గొనాలని చెప్పడంతో సమంత భయపడుతున్నట్లు సమాచారం. సుమారు 12 సంవత్సరాల క్రితం ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ కోసం ఈమె ఆడిషన్స్ కి వెళ్లారు. అప్పటి నుంచి తన ఏ సినిమాకి ఆడిషన్ చేయలేదని తిరిగి ఈ సినిమా కోసం ఆడిషన్స్ చేయాల్సి రావడంతో అప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయ్ అని వెల్లడించారు.