విజయ్ దేవరకొండని చిక్కుల్లోకి నెట్టేసిన సమంత.. ఆలస్యం అవుతున్న ఖుషి షూటింగ్!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత ఇప్పుడు నార్త్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సమంత ఆ సినిమా తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. దీపం ఉన్నట్టుగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్నట్లు సమంత వచ్చిన అవకాశాలు అన్నింటిని సద్వినియోగం చేసుకోవటానికి అన్ని ప్రాజెక్టులు ఒప్పుకుంటుంది. ఈ క్రమంలో సినిమాల డేట్స్ విషయంలో క్లాష్ వచ్చి కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి. అలా షూటింగ్ కి బ్రేక్ పడిన సినిమాలలో ఖుషి సినిమా కూడా ఒకటి.

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంట గా నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. సెప్టెంబర్ రెండవ వారం నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభించాల్సి ఉంది. అయితే వరుస సినిమాలతో సమంత బిజీగా ఉండటం వల్ల డేట్స్ విషయంలో క్లాష్ వచ్చి ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో విజయ్ చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ అవ్వటంతో విజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

అందువల్ల ప్రస్తుతం సమంతతో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా తొందరగా పూర్తి చేసుకుని ఈ సినిమాతో హిట్ కొట్టాలని భావిస్తున్న విజయ్ కి సమంత డేట్స్ దొరకపోవడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేవు. మరొకవైపు పూరి జగన్నాథ దర్శకత్వంలో జనగణమన సినిమాలో కూడా విజయ్ నటిస్తున్నాడు. అయితే ఆ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న మై హోమ్ గ్రూప్స్ సంస్థ హ్యాండ్ ఇవ్వటంతో ఆ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ప్రస్తుతం విజయ్ ఏమి చేయాలో తోచక ఆలోచనలో పడ్డట్టు సమాచారం.