తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది.ఇలా ఇదివరకు ఈమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన సమంత ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈమె ఒక్క బాలీవుడ్ సినిమాకి కూడా కమిట్ అవ్వలేదు.
విడాకుల తర్వాత సమంత కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే పాన్ ఇండియా స్థాయి సినిమాలను కూడా చేస్తున్నారు. ఇకపోతే తాజాగా సమంత సన్నిహితుల సమాచారం ప్రకారం ఈమె ఎక్కువగా ఇతర భాషల కన్నా తెలుగు సినిమాలను చేయడానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది.అదేవిధంగా ప్రతిభావంతుడైన దర్శకుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాణ సంస్థలో తనకు అవకాశం వస్తే ఏకంగా రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోవడానికి తాను సిద్ధంగా ఉందని వెల్లడించారు.
సాధారణంగా గుర్తింపు వచ్చిన తర్వాత చాలామంది బారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు. కానీ సమంత మాత్రం విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం ఏంటి అనే విషయానికి వస్తే..కేవలం నాగచైతన్య పై రివెంజ్ తీర్చుకోవడం కోసమే ఈమె రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య కన్నా ఈమె తెలుగులో ఎక్కువ అవకాశాలను అందుకొని తనని డిమాండ్ చేయాలని భావిస్తున్నారట. అందుకే తక్కువ రెమ్యూనరేషన్ కి కూడా ఈమె సై అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంత గురించి ఇలాంటి వార్తలు రావడంతో చైతన్య అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.