Samantha: సమంత గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రెండ్ అవుతున్న పేరు. గత కొద్ది నెలల నుంచి సోషల్ మీడియాలో ఈమె పేరు వినిపించడానికి గల కారణం ఈమె విడాకులు తీసుకోవడమేనని చెప్పవచ్చు. ఇక సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన తర్వాత సమంత నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో విషయాలను,తన మనసులోని భావాలను కొటేషన్లు రూపంలో బయట పెడుతున్నారు. ఇలా మైమామ్ సైడ్ అంటూ సమంత ఎన్నో కొటేషన్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
తాజాగా తన జీవితంలో ఇది ఒక గుణపాఠం అంటూ సమంత షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తన జీవితంలో తాను తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని విషయాన్ని గ్రహించాలని ఇదే తన జీవితంలో నేర్చుకున్న గుణపాఠం అంటూ సమంత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సమంత సినిమాల విషయానికి వస్తే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నాయి. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇవేకాకుండా ఈ బ్యూటీ ఏకంగా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో 27ఏళ్ల తమిళ యువతి బైసెక్సువల్ పాత్రలో సమంత కనిపించనుంది.అలాగే సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ పాటపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అత్యధికంగా ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ అత్యధిక రికార్డులను సృష్టించింది. ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 20 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకొని టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.