Samantha: మై మామ్స్ సెడ్ హాష్ టాగ్ తో సమంత కొత్త ఎమోషనల్ పోస్ట్… ధైర్యం అంటే స్పార్క్ మాత్రమే!

Samantha: అక్కినేని నాగ చైతన్యతో విడాకుల అనంతరం సోషల్ మీడియాలో విభిన్న పోస్ట్ లు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తోన్న అందాల భామ సమంత, ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ షూటింగ్స్ లో బిజీగా గడుపుతోంది. పుష్ప సినిమాలోని ఊ అంటారా ఊఊ అంటారా అనే సాంగ్ తో ఒక్కసారిగా ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది సమంత.

ఇక పోతే చై తో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో సమంత ఏం పోస్ట్ చేస్తున్నా అది వైరల్ గా మారుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఒక చెట్టును కౌగిలించుకొని, ఫ్రీ హగ్స్ అంటూ చేసిన పోస్ట్ కూడా మొన్నటి దాకా ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే. దానిపై పలువురు నెటిజన్లు సైతం స్పందించి వివిధ రకాలుగా కామెంట్స్ కూడా చేశారు. మొన్నటికి మొన్న తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కు హెయిర్ కట్ చేసిన వీడియోను కూడా ఆమె ఇన్స్ స్టాగ్రామ్ లో పంచుకొని, తన మల్టీ టాలెంట్ ను తెలియ దేసింది సమంత.

ఇలా సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టిివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఎమోషనల్ కోట్ ను షేర్ చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. కొన్ని సార్లు మన మనసులోని బలం అందరికీ కనిపించేంత పెద్ద ఫైర్ కాదు, కొన్ని సార్లు అది చిన్న స్పార్క్.. ఇది ఎప్పుడూ మృదువుగా ఉంటుంది.. అని రాస్తూ, మై మామ్స్ సెడ్ అనే హాష్ టాగ్ ను జత చేసింది. ఇదిలా ఉండగా చై తో విడాకుల తర్వాత అతన్ని అన్ ఫాలో చేయడం, అతని ఫొటోస్ కూడా డెలీట్ చేయడం అందరికీ తెలిసిందే.