Samantha: సినీనటి సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే ఇలా పెళ్లయిన కొద్ది సంవత్సరాలకి వీరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం నాగచైతన్య తిరిగి మరో నటి శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ శోభిత నాగచైతన్యల వివాహం జరిగింది. ఇలా తన మాజీ భర్త మరోసారి పెళ్లి చేసుకోవడం పట్ల సమంత ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత సమంత పలు సందర్భాలలో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి నేను చైతన్య కనుక ఓకే గదిలో ఉంటే అక్కడ కత్తులు కనుక ఉండి ఉంటే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందని తెలిపారు. అలాగే నేను సంపాదించిన దాంట్లో అత్యధికంగా తన మాజీ భర్తకు గిఫ్ట్ ఇవ్వటం కోసమే ఎక్కువగా ఖర్చు చేశానంటూ కూడా ఈమె మాట్లాడిన విషయం తెలిసిందే.
ఇలా పలు సందర్భాలలో నాగచైతన్య గురించి సమంత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు చైతన్య రెండో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి చైతన్య తిరిగి మరో పెళ్లి చేసుకోవడంతో మీలో ఏదైనా అసూయ కలిగిందా అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది. ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ…
అసూయ… నా జీవితంలో దానికసలు చోటే లేదని తెలిపారు.అసూయే అన్ని అనర్థాలకు కారణమని భావిస్తాను నేను. అందుకే నా జీవితంలో అసూయ భాగం కావడాన్ని అస్సలు అంగీకరించననీ తెలిపారు. సమంత మాటలను బట్టి చూస్తుంటే చైతన్యను ఈమె ఎప్పుడో మర్చిపోయిందని స్పష్టమవుతుంది అదేవిధంగా విడాకులు తీసుకోవడం గురించి కూడా ఈమె మాట్లాడారు. తాను ఆ బంధం నుంచి బయటకు రావడం కోసం చాలా అంటే చాలా శ్రమించాను అంటూ సమంత విడాకుల గురించి నాగచైతన్య రెండో పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.