రెండో పెళ్లి చేసుకోకూడదని ఇంతటి త్యాగానికి సిద్ధమైన సమంత!

సమంత ఏం చేసినా చేయకపోయినా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తుంటారు. ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించే పెళ్లి చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ మనస్పర్ధల వల్ల వీరిద్దరూ విడిపోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా వార్తలు వచ్చిన కొన్ని రోజులకే నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకోబోతున్నానని అధికారికంగా ప్రకటించారు. ఈ విధంగా ఈమె విడాకులు తీసుకున్న తర్వాత పలు గ్లామరస్ ఫోటోషూట్లతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అదేవిధంగా సమంత ఐటమ్ సాంగ్స్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు.

ఈ విధంగా సమంత నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే కొద్ది రోజుల నుంచి సమంత సోషల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్ గా లేదు. ఇలా దాదాపు నెల రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నటువంటి సమంత షాకింగ్ డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది.విడాకులు తీసుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులు తనని రెండవ వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట. ఇలా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనటువంటి సమంత అమ్మతనానికి దూరం కావాలని భావించారనీ వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా తాను రెండవ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఈమె పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని అమ్మతనానికి దూరమయ్యారట.ఇలా ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలోనే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. తనకు పిల్లలు పుట్టే భాగ్యం లేకపోతే తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయరనీ ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా సమంత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు విన్న నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.