సామ్ సత్తా..ఏకైక హీరోయిన్ గా ఓ భారీ రికార్డు..!

సౌత్ ఇండియా సినిమా దగ్గర అపారమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకామె కాగా ఆమె ఇప్పుడు హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా ఆమె మెయిన్ లీడ్ లో నటిస్తుంది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా సమంత చేస్తుండగా ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ఇపుడు థియేటర్స్ లో రిలీజ్ అయింది.

యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తన మజిలీ దర్శకుడు శివ నిర్వాణతో చేసిన ఆ సినిమానే “ఖుషి”. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి అనూహ్య స్పందనను అయితే అందుకోగా ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో అయితే 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా ఇపుడు నిలిచింది.

అయితే ఈ చిత్రంతో సమంత టాలీవుడ్ లో హీరోయిన్ కూడా అందుకోని నెంబర్ ని అయితే వెళ్లినట్టు తెలుస్తుంది. హీరోయిన్స్ పరంగా మన టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా సినిమా దగ్గర కూడా ఏ హీరోయిన్ కి లేనన్ని ఎక్కువ 1 మిలియన్ మార్క్ ఉన్న సినిమాలు సమంతకి ఉన్నాయట.

ఇప్పటివరకు ఖుషి తో కలిపి యూఎస్ లో మొత్తం 17 సినిమాలు సమంత నటించినవి యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినవి ఉన్నాయట. దీనితో ఇన్ని సినిమాలు ఉన్న ఏకైక హీరోయిన్ గా అయితే సమంత నిలిచినట్టుగా తెలుస్తుంది. మరి ఓ హీరోయిన్ కెరీర్ లో ఇన్ని సినిమాలు నిలవడం చాలా రేర్ అంశం అనే చెప్పాలి.