Samantha: టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్ గా ఎంతో పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా విడాకుల తర్వాత వీరిద్దరు తమ కెరియర్లో ఎంతో బిజీగా ఉండి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రస్తుతం కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సమంత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సమంత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త పెద్ద ఎత్తున తమిళ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తపై సమంత స్నేహితురాలు స్పందించారు.
ఈ సందర్భంగా సమంత స్నేహితురాలు మాట్లాడుతూ…సమంత విడాకుల తర్వాత ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని ఇప్పుడే ఇప్పుడే ఆ బాధ నుంచి బయట పడి పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టిందని వెల్లడించారు.ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తూ ఉందని తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఏ మాత్రం రాలేదని సమంత స్నేహితురాలు వెల్లడించారు. సమంత ప్రస్తుతం తన ఒంటరి జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇక రెండవ పెళ్లి గురించి ఆలోచనే తనకు రాలేదని,తను పెళ్లి చేసుకోబోతోంది అంటూ వచ్చే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆమె కొట్టిపారేశారు. ప్రస్తుతం సమంత తన కెరియర్ పై దృష్టి సారించిందని పెళ్ళి ఆలోచన ఏమీ లేదని ఒకవేళ భవిష్యత్తులో తాను పెళ్లి చేసుకోవాలంటే తన మనసుకు నచ్చిన వాడు దొరికితే పెళ్లి చేసుకుంటుందేమో కానీ ప్రస్తుతం తనకు ఏవిధమైనటువంటి పెళ్లి ఆలోచన లేదని తెలియజేశారు. ఇక ఈ విషయంపై సమంత అభిమానులు స్పందిస్తూ కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ విధమైనటువంటి వార్తలను సృష్టిస్తున్నారని ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో గాయపడిన సమంత అంతలోనే రెండో పెళ్లి ఎలా చేసుకుంటుంది అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.