Samantha: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీ విడుదలై దేశవ్యాప్తంగా ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఊ అంటావా మామ అనే పాట ద్వారా నటి సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఐటం సాంగ్ ద్వారా సమంతకు ఎంతో మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎక్కడ చూసినా ఈ పాట వినిపించేది.ఇక ఈ సినిమా తర్వాత ఈ పాట విషయంలో సమంత చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలియజేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక తాజాగా మరోసారి సమంత ఐటమ్ సాంగ్ పై స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సమంత వద్ద విలేకరులు ఈ పాట గురించి ప్రస్తావించడంతో మరోసారి సమంత ఐటమ్ సాంగ్ పై స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సమంత ఈ పాట గురించి మాట్లాడుతూ… పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘ఊ అంటావా మావా’ సాంగ్‌కు ఈ స్థాయిలో స్పందన వస్తుందని అసలు ఊహించలేదు. ఈ పాటను కేవలం తెలుగు పాటగా బావించి మాత్రమే చేశానని తెలిపారు.
కానీ ఈ పాట దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ పాటకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి క్రేజ్ ఏర్పడిందని ఈ సందర్భంగా సమంత తెలిపారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు నటించిన సినిమాల గురించి ప్రస్తావించకుండా
ఊ అంటావా మావా’ పాటలో మీరు బాగా చేశారంటూ చెబుతున్నారు. అలా ప్రతి ఒక్కరు ఈ పాట గురించి చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉందని మరోసారి సమంత ఐటమ్ సాంగ్ పై స్పందించారు.