పూజా హెగ్డే కి చెక్ పిట్టిన సమంత ..భారీ పాన్ ఇండియన్ సినిమాలో ఛాన్స్ ..?

2020 ప్రారంభంలోనే ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అక్కినేని సమంత. అయితే ఈ సినిమా హ్యాట్రిక్ కొట్టాలనుకున్న సమంత ని బాగా డిసప్పాయింట్ చేసింది. ఇక కాస్త గ్యాప్ తీసుకున్న సమంత ప్రస్తుతం తమిళంలో నయనతార తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. అలాగే ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సీరీస్ లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ అండ్ డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసింది సమంత.

NTR 30 Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News, Photos  & Videos | Moviekoop

కాగా సమంత ఒక పాన్ ఇండియన్ సినిమాలో నటించబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. హారిక అండ్ హాసిని, ఎన్.టి.ఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాత ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా మొదలుకాబోతుంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. కాగా కాస్టింగ్ విషయంలో హీరోయిన్ ని ఎంచుకోవాలనుకున్న మేకర్స్ సమంత ను సంప్రదించినట్టు తెలుస్తుంది. ఇన్నాళ్ళు పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ అన్న ప్రచారం జరిగింది. కాని తాజాగా సమంత పేరు వైరల్ అవుతుండటం తో పూజా హెగ్డే ఛాన్స్ సమంత దక్కించుకుందని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా పూజా హెగ్డే తెలుగు సినిమాలతో పాటు వరసగా బాలీవుడ్ లో సినిమాలు కమిటయింది.

ఈ కారణంగా పూజా హెగ్డే డేట్స్ లేకపోవడంతో సమంత వచ్చి చేరిందని అంటున్నారు. ఇంతక ముందు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అఆ’ సినిమాలలో సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్.టి.ఆర్ తో కలిసి బృందావనం, రభస, రామయ్య వస్తావయ్య, జనతా గ్యారేజ్ సినిమాలు చేసింది. ఇక మరోసారి ఎన్.టి.ఆర్ – త్రివిక్రమ్ – సమంత కాంబినేషన్ అనగానే అంచనాలు భారీగా పెరిగాయి.

Exclusive : Telugu girl making big in Bollywood!