Samantha: సమంత దక్షిణాదిన టాప్ హీరోయిన్లలో ఒకరు పెళ్లి తర్వాత ఆలోచించి కథా పరమైన సినిమాలు చేస్తున్న సమంత చైతూ తో విడాకుల తర్వాత మరింత జోరుగా సినిమాలు చేస్తోంది.అటు నార్త్ ఇటు సౌత్ ను కలుపుతూ ఏకంగా హాలీవుడ్ వైపు కూడా చూస్తోంది. వరుస ప్రాజెక్టులతో మిగతా హీరోయిన్ లకు చమటలు పట్టిస్తోంది. పాన్ ఇండియా సినిమాలైన శాకుంతలం, యశోదర షూటింగ్ లో పాల్గొంటూనే ఇంకో ప్రాజెక్ట్ కి ఒక చేసింది. విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటించనుంది సామ్. వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కు ఇండియన్ వెర్షన్ లో నటించనుంది.
అయితే సమంత నాగ చైతన్య విడాకుల గురించి మాత్రం ఇంతవరకు ఒక క్లారిటీ లేదు. విషయంలో అటు నాగచైతన్య కానీ ఇటు సమంత కానీ ఎప్పుడూ కూడా పెదవి విప్పలేదు. వీరు తమ విడాకులను ఎప్పుడైతే అధికారికంగా ప్రకటించారో అప్పటి నుంచి సమంత పట్ల రకరకాల రూమర్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సమంత తన వ్యక్తిగత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో సన్నిహితంగా ఉండడం వల్లనే నాగచైతన్య-సమంత విడిపోయారు అని రూమర్లు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ప్రీతమ్, సమంతను అక్కా అని పిలుస్తాడని ఆమె సన్నిహితులు ట్రోలర్స్ కి క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. వాటన్నింటినీ దాటుకొని సమంత తన జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టింది.
ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమంలో సమంత తో అతనిని కలిసి చూసిన ట్రోలర్స్ ఆమెపై మరొకసారి విరుచుకుపడ్డారు. ఇక తాజాగా ప్రీతమ్ కి సామ్ హెయిర్ కట్ చేయడం కొసమెరుపు. దాంతో ట్రోలర్స్ కి ఇంకా మండిపోయింది. ఈ క్రమంలో సామ్ పైన వచ్చిన కౌంటర్ లకు సమంత ఎన్కౌంటర్ చేస్తోంది. అనవసర వ్యాఖ్యలు మాని ఎవరి పని వారు చేసుకుంటే మంచిది. కొంతమంది వ్యక్తులు చేసిన నిరాధారమైన ఆరోపణల వలన నేను ప్రీతమ్ స్నేహాన్ని మరియు అతని కెరియర్ ని నాశనం చేయ దలుచుకోలేదు. మేమేంటో మాకు తెలుసూ అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది సమంత.