నిర్మాతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సామ్

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో ఒకప్పటి నిర్మాత, సినీ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు ఓ మీడియా ఇంటర్వ్యూలో తీవ్ర విమర్శలు చేశారు.

స్టార్ హీరోయిన్ గా సమంత పని అయిపోయిందని అన్నారు. ఆమె తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంగా చీప్ గా సింపతీ డ్రామా ఆడుతోంది అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమంత వరకు వెళ్ళినట్లు తెలుస్తోంది. తాజాగా సమంత స్క్రీన్ షాట్స్ తో ఇన్స్టాగ్రామ్ లో పేరు ప్రస్తావించకుండా ఒక పోస్ట్ పెట్టింది.

టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ఎక్కువ అయితే చెవులో వెంట్రుకలు పెరుగుతాయంట అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ కాస్తా వైరల్ అయ్యింది. సమంత ఈ కామెంట్స్ చిట్టిబాబుని ఉద్దేశించి చేసినవే అనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వస్తోన్నాయి. ఈయన గతంలో కూడా పవన్ కల్యాణ్ తో పాటు చాలా మంది మీద ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు.

ఒక్కోసారి బీజేపీ నాయకుడిని అంటుకుంటూ పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే సమంత మీద గత కొంతకాలంగా ఇష్టానుసారంగా మాట్లాడటంతో పరోక్షంగా సమంత టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ఎక్కువ అయిపోవడం వలన చిట్టుబాబు ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు చేసినట్లు అయ్యింది.

మరి దీనిపై చిట్టిబాబు ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి. ఇక సమంత పెట్టిన పోస్టుని స్క్రీన్ షాట్స్ తీసి మరి ఆమె ఫ్యాన్స్ చిట్టిబాబుని ఉద్దేశించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం తాజాగా లండన్ వెళ్ళింది. అక్కడ హాలీవుడ్ సిటాడెల్ వెబ్ సిరిస్ ఈవెంట్ లో పాల్గొంది. ఆమెతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఉండటం విశేషం.