విడాకులపై సమంత హాట్ కామెంట్స్.. ఫస్ట్ టైమ్ ఇలా.

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం మూవీ ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో సమంత చురుకుగా పాల్గొంటుంది. శారీరకంగా కాస్తా బలహీనంగా ఉన్నా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో కచ్చితంగా దేశ వ్యాప్తంగా ఈ సినిమాగా కరెక్ట్ గా రీచ్ చేయాలి.

ఈ బాద్యతలని సమంత తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత 2021లో విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత ఇప్పటి వరకు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనే విషయంపై సమంత పెద్దగా రియాక్ట్ కాలేదు. అయితే మొదటి సారి మాత్రం తన వివాహబంధం, విడాకులపై సమంత ఓ ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేసింది.

విడాకుల తర్వాత పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చింది. అయితే చాలా మంది ఆ సాంగ్ చేయొద్దు అంటూ సలహాలు ఇచ్చారని పేర్కొంది. విడాకులు అయిన వెంటనే అలాంటి సాంగ్ లో నటించడం కరెక్ట్ కాదని ఇంట్లో సైలెంట్ గా ఉండాలని ఉచిత సలహాలు ఇచ్చారని పేర్కొంది. అయితే ఇంట్లో కూర్చొని ఉండటానికి నేనేమీ తప్పు చేయలేదు కదా.

వివాహబంధంలో నేను 100 శాతం నిజాయితీగా ఉన్న. అయినా కూడా మా బంధం నిలబడలేదు. చేయని తప్పుని నేనెందుకు శిక్ష అనుభవించాలి అని డిసైడ్ అయ్యి ఆ సాంగ్ ఒప్పుకోవడం జరిగిందని సమంత పేర్కొంది. అయితే విడాకులకి కారణం తాను ఎంత మాత్రం కాదని ఈ వ్యాఖ్యల ద్వారా సమంత చెప్పినట్లు అయ్యింది. తమ బంధం వీగిపోవడానికి చైతూనే కారణం అని పరోక్షంగా చెప్పకనే చెప్పింది.

ఇప్పుడు సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే తాను కళ్ళజోడు పెట్టుకుంటే అందరూ స్టైల్ కోసం అనుకుంటున్నారని, అలాంటిదేం కాదని చెప్పింది. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నుంచి ఎక్కువ లైటింగ్ చూడలేకపోతున్నానని, ఈ కారణంగానే కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుందని సమంతా క్లారిటీ ఇచ్చింది.

విడాకులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు | Samantha Comments On Divorce | Ntv