War In Ukraine: ఉక్రెయిన్ పై రష్యా దాడి గురించి స్పందించిన..సమంత, కాజల్.!

War In Ukraine: ఉక్రెయిన్ రష్యా దాడుల గురించి ప్రపంచమంతా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రపంచ దృష్టి అంతా ఈ అంశం మీదనే ఉంది. రష్యా సైన్యం దాడి చేయడంతో ఉక్రెయిన్ లో భయానక వాతావరణం నెలకొంది. ఇది గమనిస్తున్న ప్రపంచమంతా ఉక్రెయిన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటుంది. ఉక్రెయిన్ పై దాడుల విషయంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలందరూ, ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, తమ అభిప్రాయాలని, వ్యక్తపరుస్తున్నారు.

ఉక్రెయిన్ పై దాడులకు సంబంధించి బాలీవుడ్ బ్యూటీ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా స్పందిస్తూ, ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ లో భయానక వాతావరణం నెలకొందని, సంక్షోభం కారణంగా ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారని ప్రియాంక చోప్రా ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రియాంక చోప్రా షేర్ చేసిన ఈ వీడియోని కాజల్ అగర్వాల్ రీ పోస్ట్ చేసి, తన అభిప్రాయాన్ని హార్ట్ బ్రోకెన్ ఎమోజీ లతో వ్యక్తపరిచింది.

రష్యా దాడుల గురించి హీరోయిన్ సమంత కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఒక వేళ మీరు కనుక దీని గురించి చదివి ఉంటే ప్రస్తుతం శాంతి గురించి ప్రార్థించండి. అక్కడ శాంతి అందరి హృదయాలలోనూ అందరి ఇళ్ళల్లో నిండిపోవాలని ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా జీవించడానికి అర్హులు #ఉక్రెయిన్ అంటూ సింగర్ చిన్మయి చేసిన పోస్టును సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇలా ఉక్రెయిన్ పై దాడులకు సంబంధించి సెలబ్రెటీలు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.